Wednesday, September 30, 2009

హై కమాండ్ కింక ఏమి కావలండి

హై కమాండ్ కింక ఏమి కావలండి జగన్ కన్నా మంచి వాడు ఎవడు దొరుకుతాడు అందరు జగన్ కావాలని కోరుకుంటుంటే ఇంకా రోశయ్య ని ఉంచటంలో అర్దం ఏమిటి రోశయ్య ఎలాగు సమర్దవంతుడే అయినప్పటికి యువకుడు కాదు రాజీవ్ గాంధి యువరాజ్యం కావలంటు 2014కల్ల ప్రధాని అవాలని భావిస్తుంటే ఆంధ్ర లో జగన్ కొడుకు ఎందుకాకుడదు అది నా ప్రశ్న అంతే మీ కామెంట్లు ???

7 comments:

  1. >>>>> రాజీవ్ గాంధి యువరాజ్యం కావలంటు 2014కల్ల ప్రధాని అవాలని భావిస్తుంటే ఆంధ్ర లో జగన్ కొడుకు ఎందుకాకుడదు అది నా ప్రశ్న ..........................
    ఆవేశం ఎక్కువైతే ఇట్లాగే వుంటుంది మరి.!!
    రాజీవ్ గాంధీకి రాహుల్ గాందీ కి తేడా తెలియదు. (( జగన్ కొడుకు --- ఇదేం మాట? )
    రాహుల్ గాందీ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడో తెలియదు. 2014 వరకు ఎందుకు అగుతున్నాడో, ఇప్పుడు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలియదు. ఆయన ఇప్పుడే ప్రధాని అవడానికి ఎవరైనా అడ్డం పడుతున్నారా? తెలియదు.

    జగన్ అసలు "రాను రాను అనుకుంటూ" రాజకీయాల్లోకి వచ్చి ముచ్చటగా మూడ్నెల్లు కాలేదు. ఒక కాలు వ్యాపార సామ్రాజ్యం లో ఒక కాలు రాజకీయాల్లో. అదీ పార్లమెంటు సభ్యుడిగా వున్నాడు. ఇంకా రాజకీయాల్లో అక్షరాభ్యాసమే కాలేదు. అప్పుడే ఏకంగా ముఖ్యమంత్రి పదవి కావాలి.. సీనియర్లంతా వెధవలు గా నిందలు మోయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి ఒక కుటుంబ పార్టీ స్థాయికి దిగాజారాలి.
    ఆవేశం తగ్గించుకుని ఇవన్నీ ఆలోచిస్తే మీ ప్రశ్నకు సమాధానం మీరే చెప్ప గలరు.

    ReplyDelete
  2. జగన్ ను రాహుల్ గాంధితో పోల్చారు కదా!
    ఇంక మీకు ఎవరైనా ఏమి చెప్పగలరు?

    ReplyDelete
  3. rajanna and chandamama ,

    Both of you well said,It is enough for him to understand.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. అయ్యా జగన్ కొడుకు అని తప్పు పడింది అది నేను చూసుకోలేదు మీకు అర్దమయిందిగా అది జగన్ అని సంతోషం

    మీకు ఇంకా తెలిదనుకొంటా జగన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే స్తున్నాడు సరే వస్తాడో రాడో అది తరవాతి సంగతి మీరు తప్పు పట్టింది జగన్ ని రాజీవ్ గాంధితో పోల్చడం అంతేగా.

    వినండి ఇతనోచ్చి 3నెలలే అయినా ఇతనికి ప్రతి విషయం గురించి తెలుసు మరి రాజీవ్ కేమి తెలుసు ఒకసారి అనుఒప్పదం మీద మీటింగ్ చెప్పటానికొచ్చి అందులో ఒక స్టూడెంట్ అడిగిన దానికి సమధానం చెప్పలేక పోయాడు అణుచిత వాఖ్యలు చేస్తు మిడియా ముందుకొస్తాడు.అంతేనా రాజీవ్ అంటే.

    జగన్ ఎలా మాట్లడుతున్నాడో చూసేఉంటారు తెలుసుకోండి అంటే మీ దౄష్ఠిలో ప్రజలు, యం.యల్.యేలు పిచ్చోలు సినియర్లు మహనాయకులు

    హనుమంతరవు అతను ఒక సినియరేనా వై.యస్.చనిపోయి ఒకనెల కూడ కాలేదు అప్పుడే భూటకపు చావులు అని మాట్లడటం ఇంగిత జ్ణానం లేని సినియర్లకి జగన్ ఏమి తీసిపోడు వాళ్ళందరు వంశపారంపర్యంగా రావచ్చు జగన్ రాకూడద ప్రజలందరు 75%జగన్ కావలంటుంటే అంతమంది లో అందరు పిచ్చ్లేనా మంచోడేవడు లేడా!!

    ReplyDelete
  6. ya ya i hav understand that well said but niharika gaaru just listen jagan is very good politician to get a great job of cm

    is very equal to rahul gandhi

    ReplyDelete
  7. హలో చందమామ గారు నిహరిక గారు రాజన్న గారు ఈ రోజే యహూ లో పడిన మీరు గొప్పగా మెచ్చుకొనే రాహుల్ గురించిన వార్త చదవండి

    భావి ప్రధానిగా అభివర్ణిస్తున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విద్యార్థులు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వలేక పోయారు. దీంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతేకాకుండా.. ఇలాంటి వ్యక్తిని భావి ప్రధానిగా అభివర్ణించడమా అంటూ పెదవి విరిచారు.

    దేశ రాజధానిలో రాహుల్ గాంధీ బుధవారం ఒకరోజు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా.. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చా వేదికకు రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు రాహుల్‌పై పెక్కు ప్రశ్నలు సంధించారు.

    వాటిలో ఏ ఒక్కదానికి కూడా సూటిగా, సరైన సమాధానం ఇవ్వలేక పోయారు. విద్యార్థులు పలు అంశాలపై పలు రకాల ప్రశ్నలు వేశారు. అయితే, ఒక్క అంశంపై కూడా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల రాహుల్ సమాధానం ఇవ్వలేక పోయారని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

    రాహుల్‌లో పెద్దగా సత్తా లేదని, కేవలం మీడియా ప్రచారం వల్లే అతనికి ఇంత ప్రాధాన్యం, ప్రాచూర్యం లభిస్తోందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని అయితే అభివృద్ధిలో మరో 60 సంవత్సరాలు దేశం వెనక్కి పోవాల్సి వస్తుందని నిర్మొహమాటంగా తమ మనస్సులోని మాటను వెల్లడించారు.

    సరేనా ఈ వార్త విన్న తరవాత మీ అభిప్రాయం మార్చుకోండి .పై కామెంట్ రాసేముందు రాజీవ్ ప్రధాని మంత్రి కి సరిపోతాడు జగన్ కి ఇక్వెల్ అనుకున్నా ఈ వార్త చదివక అసలు జగన్ ని అతనితో పోల్చడం తప్పనిపిస్తోంది

    ReplyDelete