Friday, October 9, 2009

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి

చందమామ రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే చల్లటి వెన్నలనిచ్చే చందమామపై పరిశోధనలపేరుతో దాడులు జరుగుతున్నాయి. జాబిల్లిపై నీరుందని తెలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు అమెరికా ఖగోళశాస్త్రజ్ఞులు శుక్రవారం ఓ రాకెట్టును చంద్రుడిని ఢీకొట్టేందుకు పంపించారు. ఇది చంద్రుడిని ఢీ కొట్టింది. దీంతో దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున ఎగిసిపడింది. అక్కడ నీరున్న ఆనవాళ్లు తెలిసినప్పటినుంచి వాటి లోతుపాతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతరిక్ష శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉంది. ఆ గుట్టు తెలుసుకునేందుకుగాను అమెరికాలోని అంతరిక్ష పరిశోధనాకేంద్రం నాసా ఈరోజు ఒక రాకెట్‌ని ప్రయోగించింది. నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టిందని, దాంతో చందమామపై దుమ్ము, ధూళి భారీగా ఎగసిపడ్డాయని తెలుస్తోంది. చంద్రునిపై నీటిజాడల విషయమై సాగుతున్న పరిశోధనల్లో అత్యంత ఖర్చుతో కూడిన ప్రయోగంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ రాకెట్ ఢీ కొట్టిన సమయంలో అక్కడి చిత్రాలు అంతరిక్ష కేంద్రానికి అందుతాయి. వాటిని పరిశీలిస్తే చందమామ నీటి గుట్టు రట్టయిపోతుంది. అందుకు మరి కొన్ని గంటలు చాలని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Monday, October 5, 2009

జగన్ పత్రిక ప్రభుత్వ వ్యతిరేకo

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, యువ పారిశ్రామికవేత్త, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సొంత పత్రిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. వైఎస్ తనయుడైన తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ వార్తా కథనాలను పుంఖాను పుంఖాలుగా రాస్తున్నట్టు ఆ పత్రికను చదువుతున్న అనేక మంది పాఠకులు చెపుతున్నారు.

తన తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఆ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక మార్కెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే సర్కులేషన్‌ను పెంచుకోవడమే కాకుండా, కోట్లాది మంది పాఠకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా, తెలుగు పత్రికా రంగాన్ని శాశిస్తూ వచ్చిన "ఆ రెండు పత్రిక"ల యాజమాన్యం గుండెల్లో దడ పుట్టించేలా చేసింది.

ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రచారాన్ని ఆ పత్రిక, టీవీ ఇచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసి ఓటర్ల మనస్సు మారకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఖంగుతిన్న జగన్.. తన సొంత పత్రిక ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు రోశయ్య ప్రభుత్వ పనితీరును ఎండగడుతోందని ఆ పత్రికా పాఠకులు అంటున్నారు.
మొత్తం మీద జగన్ పత్రిక ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా మారిందనే చెప్పొచ్చు.

Sunday, October 4, 2009

వరద పై మీ స్పందన మీ కామెంట్ రూపంలో

chiru:వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకున్న బాధితుల ప్రాణాలను కాపాడటంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రరాపా ఐదుగురు సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు . వరద ముంపునకు గురైన ప్రాంతాలకు వైద్యo. కర్నూలు, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో ప్రజలకు తమవంతు సాయం, సేవలు అందించాల్సిందిగా ప్రరాపా కార్యకర్తలను, అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. తినడానికి తిండిలేక మహబూబ్ నగర్‌లో వందలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. అలాగే, ఈ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

jagan:రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు చేయూత నిచ్చేందుకు కాంగ్రెస్ కార్యర్తలు, వైఎస్ జగన్, వైఎస్సార్ అభిమానులు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాస ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. వరద సహాయక చర్యల్లో పర్యటించాలనే కోరిక ఉందన్నారు. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద ప్రాంతాల పర్యటనకు వెళ్ళి, సహాయక చర్యలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు జగన్ తెలిపారు.

rosaiah:వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయక సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. వరద పరిస్థితిపై ఆయన ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల వరద ప్రమాదం పొంచివుందన్నారు. అయితే, ప్రస్తుతానికి వరద ఉధృతి తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ, వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారులకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచన మేరకు ప్రమాద ప్రాంతాలను తక్షణం ఖాళీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఖాళీ చేయని వారిని పోలీసుల సహకారంతో బలవంతంగా అక్కడ నుంచి తరలించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. వరద నీరు తగ్గిన తర్వాత తిరిగి తమ ఆవాసాలకు వెళ్లాలని, ఇలాంటి వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తుందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 7.19 లక్షల క్యూసెక్కుల నీరు ఉందన్నారు. ఎగువ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తే ఈ నీటిమట్ట మరింతగా పెరిగే అవకాశం ఉందని రోశయ్య తెలిపారు. అందువల్ల కరకట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

chandrababu:వరద సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను శక్తిమేరకు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ తమ ప్రాంతాల్లోని వరద బాధితుల సమాచారం సేకరించడం, వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు చేరవేయాలని కోరారు. అంతేకాకుండా, వరద బాధితులకు స్వచ్ఛందంగా తమ వంతు సాయం అందజేయాలని బాబు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తిన వరద కారణంగా కర్నూలు జిల్లా పూర్తిగా నీట మునిగిపోగా, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడెక్కడ వరద బాధితులు ఇబ్బందుల్లో ఉన్నారో సమాచారం తెలుసుకొని కంట్రోల్ రూమ్ లకు అందజేస్తే అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. అదే సమాచారాన్ని తమకు కూడా పంపిస్తే ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వరద ముంపు ముంచుకు వచ్చిన ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన భోజన సౌకర్యం కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.


పెద్ద పెద్ద నాయకులు వారి వారి స్పందన తెలిపారు మీరు మీ స్పందన సహయం తెలియజేయండి

యాదౄచ్చిక ఫోటో

Friday, October 2, 2009

ఈ చిత్రాలపై మీ స్పందన







ఇతను గుర్తున్నాడ ?

Shiney Ahuja
బాలీవుడ్ యాక్టర్ షైనీ అహుజాకి మూడు నెలల జైలు జీవితం తర్వాత ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ లభించింది. తన ఇంట్లో పని చేస్తున్న యువతిపై అత్యాచారం జరిపాడని మూడు నెలల క్రితం అరెస్టయిన అహుజాకి దేశం విడిచిపోరాదనే నిబంధన మీద బెయిల్ మంజూరు చేశారు.
కానీ ఈ అత్యాచార ఆరోపనల్లో నిజం లేదని అహుజా మొదటి నుండీ చెబుతూ వస్తున్నాడు. తాను ఆ యువతి అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొన్నానని, డబ్బు కోసం ఇప్పుడు ఇలా నాటకాలు ఆడుతున్నారని ఇంతకు ముందే అంగీకరించాడు. కాగా మూడు నెలలు జైల్లో గడిపిన షైనీ బాగా కృంగిపోయాడని, ఆరోగ్యం కూడా సరిగా లేదని బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన తరపు న్యాయవాది కోరిన సంగతి తెలిసిందే.

Thursday, October 1, 2009

సాక్షి టి.వి.ప్రతినిధి దుందుభిలో ఇరుక్కున్న పిల్లాడి మధ్య సంభాషణ

sakshi tv:మీరెందుకు వెళ్ళారు ? naresh:డ్యాం చూడటానికి వెళ్ళాం సార్

sakshi tv prathinidhi:నరేష్ ఏ ప్రాంతంలో ఉన్నారు? nareash:సార్ నేను బండమీద ఉన్నాను కొంచం భయంగాఉంది. sakshi tv prathinidi:నరేష్ భయపడకండి మీకు సహయక చర్యలు జరుగుతున్నాయి.. నరేష్ ఖచ్చితంగా ఎక్కడున్నారు అంటే మైలురాయి అది చెపితే మిమ్మల్ని కాపాడటానికి కుదురుతుంది!! sakshi tv prathinidhi:మీతో పాటు ఎంతమంది ఉన్నారు? naresh:సార్ 14 మంది ఉన్నాo.పక్క గ్రామలవారు కూడ ఉన్నారు. sakshi tv prathinidhi:మిమ్మల్ని ఎవరైన కాపాడేప్రయత్నం చేస్తున్నారు మికెవరైన కనిపిస్తున్నార? naresh:సార్ అంత షోజరుగుతోంది
కాపాడే ప్రయత్నం చేయట్లేదు.

sakshi tv:నరేష్ మిదగ్గర కాగితం ఎదైనా ఉందా? naresh:లేదు సార్ ఒక సెల్ ఫోన్ మాత్రమే ఉంది మేము ఇప్పడివరకు బానేఉన్నాం.నీటి ప్రవహం పెరుగుతోంది భయంగా ఉంది
అందోళనలో విధ్యార్దుల తల్లి తండ్రులు వరద తగ్గేదాక ఆగి కాపాడదామనుకుంటున్న అధికారులు :విజేందర్ సాక్షి ప్రథినిధి టేంక్యు విజెందర్ మరిన్ని అప్ డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ఇప్పటికి బ్రేక్
అంతలో బ్రేకింగ్ న్యూస్:మహబూబ్ నగర్ లో చిక్కుకున్న 15 మంది విధ్యార్ధులు హెలికాఫ్టర్ రేపు పంపుతామని చేతులెత్తేసిన అధికారులు రాజ[ఈ టపా రచయిత]అంటే వారు చనిపోయిన పట్టించుకోరు గాని హెలికాఫ్టర్ రేపు పంపుతారంట అంటే వారి ఇలోపు ఎదేనా అయితే వీరు బాధ్యులు కాద ఇప్పుడు ఎందుకురాదో మరి హెలికాఫ్టర్ మోరాయిస్తోందేమో.

ఎన్నిసినిమాలు వీళ్ళ గురించి తీస్తున్న మారనే మారరు ఈ టి.వి.వాళ్ళు