Wednesday, September 30, 2009

వానమ్మ వానమ్మ ఆగవ

వాన వచ్చి వై.యస్.ని తీసుకుపోయింది మళ్ళి వానోచ్చి పంటలు తీసుకుపోతోంది కావల్సిన వాన కన్న అతిగా పడితే ఎంత భీభత్సమో చూపిస్తోంది అధికారులయిన మనుషులేకాబట్టి వారు మాత్రం ప్రకౄతి నెదిరించి ఏం చేస్తారు సహయం చేయటానికైన వారికి చాల ఇబ్బందులు పరిమిషన్స్ ఉంటాయ్ వారు కూడ వారి చేయగలిగినమేరకు చేస్తున్నారు కావలనుకున్నప్పుడు పడని ఈ వాన ఇపుడు వచ్చి పంటలు నాశనం చేస్తోంది మరి రైతులు ఉరుకున్నా మధ్య వర్తులు ఇదే అదునుగా బొక్కుతారు.

వందలాది ఎకరాలు నీటమునిగింది వై.యస్.చనిపోయినప్పటినుంచి ఈ వాన ఆంధ్రని ఆడుకొంటోంది రెండేరోజులలో రిజర్వాయర్ మునిగేంత నీరు చేరిందంటే చూసుకోండి మరి ఎంత వాన పడిందో 'వానమ్మ వానమ్మ ఆగవమ్మ' లేనిచో నువ్వు నాశనం చేసింది కొంత దళారులు చేసేది మరి కొంత అయి పేదవారు జీవించటమే కష్టమైపోతుంది.

అయినా ఉదౄతంగా ఎందుకు ఇంత వాన అది ఎవరు చెప్పలేరనుకోండి ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రో పక్కన పెట్టి ఈ వరదలపై తగిన చర్యలు తీసుకోవాలి అధికారులార మీ పై అధికారులు పట్టించుకోపోయినా మీకు ఉన్న అధికారం మేరకు సహయం అందించండి.

నేను చెప్పేదేమిటంటే ప్రతి దానికి మంత్రులుదాక వెళ్ళనక్కర్లేదు.హైదరాబాద్ లో హోల్స్ లేకుండా చేయటానికి మంత్రి అక్కర్లేదుగా మీ పరిధిలో మీరు సహయం చేయండి.అ తరువాత మిగిలిన పై అధికారులు వస్తారు.

ఇదంత ఎందుకంటే వై.యస్.చనిపోయినిదానిని ఈ వానలకు ఆపదిస్తు రాస్తున్నాను అప్పుడు ఆలస్యంగా స్పందించారు మహనాయకుడు చనిపోయాడు.ఇప్పుడు ఈ వరద ఆపటానికి కాకపోయిన దాని నష్టనయినా ఎదుర్కొండి ఇప్పటికే 100 ఎకరాలు నాశనమయ్యాయి మిగిలినవయిన పోకుండా చూడండి డాక్టర్లు మీరు కూడ స్పందించండి స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న ఈ తరుణంలో విష జ్వరాలకు తగిన చర్యలు తీసుకోండి లేక పోతే మరికొన్ని మరణాలు

ఎవరు వచ్చిన రాకపోయిన సామన్య జనమయిన మీ మేరకు మీరే సహయం అందించుకోండి.


హై కమాండ్ కింక ఏమి కావలండి

హై కమాండ్ కింక ఏమి కావలండి జగన్ కన్నా మంచి వాడు ఎవడు దొరుకుతాడు అందరు జగన్ కావాలని కోరుకుంటుంటే ఇంకా రోశయ్య ని ఉంచటంలో అర్దం ఏమిటి రోశయ్య ఎలాగు సమర్దవంతుడే అయినప్పటికి యువకుడు కాదు రాజీవ్ గాంధి యువరాజ్యం కావలంటు 2014కల్ల ప్రధాని అవాలని భావిస్తుంటే ఆంధ్ర లో జగన్ కొడుకు ఎందుకాకుడదు అది నా ప్రశ్న అంతే మీ కామెంట్లు ???

Tuesday, September 29, 2009

ఇలాంటి వనితలను చూసి మనవాళ్ళూ నేర్చుకోవాలి

జమ్ము: ఉగ్రవాదులకు వ్యతిరేకించడంలో జమ్మూ బాలిక అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించింది. తనను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను రుక్సానా కౌసర్ ఎంతో ధైర్యంతో ఎదుర్కుంది. తనను ఎత్తుకుపోవడానికి వచ్చిన ఆరుగురిలో ఒక ఉగ్రవాది నుంచి ఎకె - 47 లాక్కుని వారిని ఎదిరించింది. ఆమె జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. మిగతా వారు కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు.

ఆమెకు గ్రామ రక్షణ కమిటీ ఇచ్చిన శిక్షణ ఇందుకు ఉపయోగపడింది. కలస్నికోవ్ ఆసాల్ట్ రైఫిల్ ను ఎలా వాడాలనే విషయంపై ఆమె గ్రామ రక్షణ కమిటీ నుంచి శిక్షణ పొందింది. ఉగ్రవాదిని గోడకు అదిమిపట్టానని, ఆ తర్వాత రైఫిల్ గన్ బట్ తో కొట్టానని, ఆ తర్వాత పలు మార్లు కాల్పులు జరిపానని రుక్సానా చెప్పింది.




చందమామ శంకర్ గారి జీవితవివరాలు





కె.రోశయ్య అనే నేను అదే జరుగుతుంది

అధిష్ఠానం ఆదేశం మేరకే తాను ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని, ఇష్టమైనవారు తనతో కలిసి పనిచేయవచ్చునని, నచ్చని మంత్రులు తన అసెంబ్లీ నుంచి వెళ్లిపోవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. రోశయ్య నిస్పష్టంగా చెప్పాడు. ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పోస్టర్లను చింపివేసిన ఘటన చోటుచేసుకోవడంపై మంత్రులపై రోశయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలకు వై.ఎస్. జగన్మోహన రెడ్డిని ఏ మాత్రం బాధ్యుడిని చేయొద్దని కోరారు. తండ్రిని పోగొట్టుకున్న శోకంలో ఉన్న జగన్‌ను మంత్రులు ఇలాంటి విషయాల్లోకి లాగొద్దని ముఖ్యమంత్రి సవినయంగా కోరుకున్నారు యం.యల్.యేలకు మాత్రం రాజీనామ చేశేవారు చెయొచ్చు నాకేం అభ్యంతరం లేదనిచెప్పారు. సోనియా గారి నిర్ణయంతో అందరు ఏకీభవించాలని హై కమాండ్ నిర్ణయం వచ్చే వరకు వేచిఉండాలని చెపుతున్నాడు మెత్తని పలుకులు పలుకుతునే తానే సి.యం అని చెప్పకనే చెపుతున్నాడు ఎంతటి ఆందోళన వచ్చిన జాప్యం చేసి యం.యల్.యేలలోని జగన్ మద్దతుని తగ్గించేవిధంగా పరిణామాలు జరుగుతున్నాయ్.

Sunday, September 27, 2009

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది

రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చురగిలింది. కాంగ్రెస్ వర్గాల్లో ఈ మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఒకవైపు జగన్ అనుకూలురు, మరో వైపు జగన్ వ్యతిరేకులు.... ఇరు శిబిరాల మధ్య వర్గపోరాటం మొదలైంది. సోనియా ఫ్లెక్సీ చించివేయడం, బస్సులకు నిప్పంటించటం, పార్టీ కార్యాలయాలకు తాళాలు వేయడం వంటి పరిణామాలతో... రాజకీయ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటిదాకా జగన్ కు పరిస్థితి అనుకూలంగా ఉందనే ఏకపక్ష భావన చెదిరిపోయింది. వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న వారి సంఖ్య పెరిగింది. నిన్న మొన్నటి వరకూ నోరుమెదపని వారూ ఇప్పుడు తెరముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరుగా ఒక్కటవుతున్నారు. అధిష్ఠానం అందిస్తున్న అండదండలతో విజృంభిస్తున్నారు. వీరందరి చేతిలో...సోనియా బొమ్మ ప్రధాన అస్త్రంగా మారింది. తాజా పరిణామాలతో జగన్ వర్గం ఆత్మరక్షణలో పడింది. సోనియా ఫ్లెక్సీ చించివేతపై జగన్ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. జగన్ ను సీఎం చేయాలంటూ కార్యకర్తలు సోనియా ఫొటోను చించివేయడంపై ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం కలగలసిన స్వరాలతో... సోనియా ఫొటోనే చించేస్తారా? వైఎస్సే సర్వస్వమనుకుంటున్నారా? సోనియా లేకుండా ఆయన గెలిచేవారా? సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించేవారు... పార్టీలో ఉండటానికి అనర్హులు. బయటికి వెళ్లిపోండి అంటూ హెచ్చరికలు జగన్ చేయాల్సి వచ్చింది.
పార్టీ నేతలు కాకా, కేకే, వీహెచ్, హర్షకుమార్, మధు యాష్కీ, రేణుకా చౌదరి తదితర నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్ లు సైతం ఆగ్రహించారు.ఇరువురూ దీనిపై చర్చించుకున్నారు. అధిష్ఠానం కూడా తీవ్రంగా స్పందించింది. జగన్ తో కేవీపీ రామచంద్రరావు బెంగుళూరులో మంతనాలు జరిపారు. ఆయన ఢిల్లీ నుంచి ఒక కవరు రావడంతో బెంగుళూరుకు వెళ్లినట్లు చెప్పారు. తాజా పరిణామాలతో జగన్ వర్గంపై అధిష్ఠానం ఆగ్రహం మరింత పెరిగింది. శరణు వేడితే తప్ప జగన్ కు సోనియా కటాక్షం లభించదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ చీలికకు ప్రయత్నాలు సాగుతున్నాయేమోనని అధిష్ఠానం అనుమానిస్తోంది. వరుస సంఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా విశ్వాసం కలిగించి, అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమనే వైఖరి ప్రదర్శిస్తేనే సోనియాను కలిసే అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో వున్నారు. మరోవైపు... రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి అయ్యేదాకా తన ప్రయత్నాలను కొనసాగించి తీరాలని జగన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ రెండో తేదీ తర్వాత 'ఓదార్పు' పేరిట ఆయన జిల్లాల్లో పర్యటించాలని యోచిస్తున్నారు. అందులోనూ... తండ్రిలాగే 'చేవెళ్ల సెంటిమెంట్' పాటిస్తూ అక్కడినుంచే తన పర్యటనలు మొదలుపెట్టనున్నారు.


ప్రత్యేకమైన పెండ్లి

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఒకేసారి నలుగురు మహిళలను పెండ్లాడాడు. పెండ్లి వేడుకల్లో పెండ్లి కూతురులకు ప్రతి ఒక్కరికి ఉంగరం తొడిగి ముద్దాడాడు. ఈ పెండ్లి సందడిలో వేలాదిమంది పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

దక్షిణాఫ్రికాలోని వీనేన్‌లో శనివారం ప్రత్యేకమైన పెండ్లి జరిగింది. అందులో పెండ్లి కుమారుడైన మిల్టన్ మ్బ్లే (44) ఏకంగా నలుగురు మహిళలను పెండ్లాడాడు. ఈ పెండ్లిలో భాగంగా అతను పెళ్ళి చేసుకున్న ప్రతి మహిళకు ఉంగరం తొడిగి ముద్దాడాడు. దీంతో పెండ్లి తంతు ముగిసిందని మత పెద్దలు ప్రకటించారు.

దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన చట్టం బహూ భార్యాత్వాన్ని సమర్థిస్తుంది. దీనికి ఉదాహరణగా అక్కడి అధ్యక్షుడు జుమాకు ముగ్గురు భార్యలుండటం గమనార్హం.

ఇదిలావుండగా ఇదివరకే ఇతనికి 11 మంది పిల్లలున్నట్లు సమాచారం.

శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.

శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు ఇతర ప్రధాన దేశాలు మాంద్యంతో అతలాకుతలమౌతున్న దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరమని తీర్మానించాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం చేటు సంపాదించుకుందని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పిట్స్‌బర్గ్ వెళ్ళిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నేతృత్వంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

Saturday, September 26, 2009

నేనే ముఖ్యమంత్రి:రోశయ్య

ముఖ్యమంత్రి కె.రోశయ్య కుండ బద్దలు కొట్టారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తరుచూ ముఖ్యమంత్రులను మార్చబోరని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తద్వారా తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రిగా ఒకరికి అవకాశం ఇచ్చి తగిన సమయం ఇస్తారని, సమర్థత నిరూపించుకోకపోతే అప్పుడు ఆలోచిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఇచ్చినట్లేనా అని ప్రశ్నించగా తాను వచ్చి నెలే అయిందని చమత్కరించారు. అప్పుడే తాను అసమర్థుడినో, సమర్థుడినో చెప్పేది ఎలా అని ఆయన ప్రశ్నించారు. మీ వృత్తిలో లాగే తాను ఎడిటర్ ప్రమోషన్ ఇప్పుడే పొందానని ఆయన అన్నారు. మీ ఎడిటర్ పోస్టు తాత్కాలికమా, శాశ్వతమా అని అడిగితే ఎడిటర్ పోస్టు శాశ్వతంగా ఉండదని అన్నారు. జగన్ ను సిఎం చేయాలని కోరడంలో తనకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. జగన్ సహజ నాయకత్వ లక్షణాలున్న నేత అని ఆయన అన్నారు.

తాను బలహీనుడ్ని, తన పరిపాలన బలహీనం కాదని ఆయన స్పష్టం చేశారు. తన బలమేమిటో తనకు ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కెవిపి రామచందర్ రావు గురించి తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మళ్లీ చెప్పడానికేమీ లేదని ఆయన అన్నారు. కెవిపి రాజ్యసభ సభ్యుడు అని, పార్టీలో కీలక నేత అని, కెవిపికి ఉన్న ప్రాముఖ్యం, గౌరవం కెవిపికి ఉన్నాయని ఆయన అన్నారు. కష్టమైనా, క్లిష్టమైనా వైయస్ రాజశేఖర
రెడ్డి [^] కార్యక్రమాలను ముందు తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. వైయస్ రాష్ట్రంలో, పార్టీలో ఓ వెలితి ఏర్పడిందని ఆయన అన్నారు. దీన్ని అధిగమించాల్సి ఉందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ సేవలను తప్పకుండా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. జగన్ ఉత్సాహవంతుడు, యువకుడు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు, ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అధిష్ఠానం చూసుకుంటుందని రోశయ్య అన్నారు. తాను ప్రకటనలు ఇవ్వకుండగా అవసరం వచ్చినప్పుడు అధిష్ఠానానికే వివరిస్తానని ఆయన చెప్పారు. డిజిపి, ప్రధాన కార్యదర్శుల మార్పు ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు.




Friday, September 25, 2009

నల్ల కాల్వలో జగన్ ప్రసంగం

జనసముద్రాన్ని తలపిస్తున్న పావురాల గుట్ట కి నేడు జగన్ తన తండ్రికి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. దానితో రాష్టంలోని ప్రతి ఒక్కరు జగన్ చూడలనే ఉద్దేశంతో పావురాల గుట్టకి చేరుకున్నారు

అదంతా చూస్తుంటే "జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనే పదం నిజమనే విధంగా జనసంద్రంతో నిండిపోయింది జగన్ వచ్చి రాగానే జగన్ సి.యం కావలంటు నినాదాలతో మారుమోగిపోయింది ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారు పరి పరి విధాల వారికి తోచిన విధంగా పాటలతో శ్రద్దాంజలి ఘటిస్తున్నారు వారందరితో పాటు అక్కడికి చేరుకున్న జగన్ శ్రద్దాంజలి ఘటించాడు సర్వమత ప్రార్ధనలు చేశాడు.

అటునుంచి వై.యస్.హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు.
అక్కడినుంచి బహిరంగ సభకి వెళ్ళాడు లక్షలాది జనంతో నిండిపోయింది నల్లకాల్వ అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ అతనితో పాటు కొంతమంది నాయకులు సర్వమత ప్రార్ధనలు జరిపారు. అందులో జగన్ని సి.యం.కావలని ప్రార్ధనలొ సర్వమత ప్రార్ధనపండితులు,పాస్టర్లు,నమాజు చేసినవారు చెప్పారు

జగన్ ప్రసంగం: వై.యస్.అభిమానులార,అక్కలార,చెల్లెలరా,తమ్ములార,అన్నలార నన్ను ఓదర్చడానికొచ్చిన మీకందరికి నా నమ:సుమాంజలి

సోదరులార మిత్రులార అక్కలార చెల్లెలార రెండుచేతులు జోడించి నా ధన్యవాదలు తెలుపుతున్నాను పుట్టెడు దు:ఖంలోఉన్న మీఆదరణ చూపారు రాష్టం నలుమూలలనుంచి వచ్చిన మీరందరికీ నా ధన్యవాదలు తెలుపుతున్నాను

ఈ రోజు పావురల గుట్టకి వెళ్ళాను అక్కడ నాన్న చనిపోయిన ప్రదేశాన్ని చూశాను.పావురాలగుట్ట పేరు గుర్తొస్తుంటే ప్రియతమనాయకుడు నాన్న గుర్తుకొస్తాడు ఇదంతా ఒక పీడకలయితే బాగుండనిపించింది. పావురాలగుట్ట గుర్తుకొచ్చినప్పుడల్ల ఆ ప్రయాణం వాయిదాపడితే బాగుండనిపిస్తోంది.

చనిపోయిన మహనాయకుడు నా తండ్రిగారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.నాకు అంతటి ఆదరణ కలిగించారు గనకనే మీరందరికి నమ:సుమాంజలి తెలుపుతున్నాను.ఆ గొప్ప నాయకుడు మనందరి జీవితాలు ప్రభావితం చేశాడు నాన్నగారు చనిపోలేదు మీఅందరి చిరునవ్వులో ఉన్నాడు ఆయన ఆప్యాతతో ఆదరణతో లక్షలాది చేతులు మీరిచ్చిన కొండoతబలం మీరిచ్చారు గనకే ఈ రోజు ఈమైక్ పట్టుకొని మీకందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లక్షలాదిమంది ఓదారుస్తున్నారు ఇదంతా చూస్తుంటే బహుశ నాన్నే అదైర్యపడకు అన్నట్టుంది నేను వై.యస్ గారిని చనిపోనివ్వాను మీఅందరి చిరునవ్వులో చూపిస్తాను అందరం అతని ఆశయాలు నెరవేర్చి అందరిలోను మహనాయకుడ్ని బతికిస్తా.

బతికున్న రోజులలో అనేవాడు గల గల పారుతున్న గోదావరి జల జల పారే కృష్ణమ్మతో కలుపుదాం రాష్ఠంలోని ప్రతి ఎకరం నీరుతో నింపుదాం ప్రతి రైతులో చిరునవ్వు చూద్దం ఆంధ్ర రాష్టంలోని ప్రతి యువకుడు పెద్దచదువులు చదువుకునే విధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్టంలోని ప్రతి మహిళ లక్షధికారి కావాలని అవన్ని నెరవేరుద్దం వై.యస్ .గారిని బ్రతికించుకుందాం

ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదలు.

ఇప్పటివరకు వై.యస్.గారి గురించి 650మంది చనిపోయారు వారిలో కొందరు ఆత్మహత్యచేసుకున్నారు వారందరిని నేను కలుస్తాను వారందరి కుటుంబాలకు న్యాయం చేస్తాను వారందరికి ప్రగడ సానుభూతి తెలుపుతున్నాను.

జై హింద్ జై.రాజశేఖర రెడ్డి,అమర్ రహే వై.యస్.ఆర్

Wednesday, September 23, 2009

బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు కొత్త శకం కోసం పిలుపునిచ్చా

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు కొత్త శకం కోసం పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించని కొత్త శకం రావాలని ఆకాక్షించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అమెరికా ఒక్కటే పరిష్కరించలేదని స్పష్టం చేశారు.

ప్రపంచమంతా సరికొత్త శకం దిశగా ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అధికారంతో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించే పరిస్థితిలేని కొత్త శకం ఆవిష్కృతం కావాలని, ఇందుకు ఇప్పటి నుంచే పని చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల చేతిలోకి అణ్వాయుధాలు చేరకుండా ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సమగ్ర అణు పరీక్షల నిరోధక ఒప్పందం (సీటీబీటీ) ఆమోదంపై ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. అణు పరీక్షలపై శాశ్వత నిషేధం అమల్లోయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఒకదేశంపై మరొక దేశం అధిపత్యం సాధించకూడని కొత్త శకాన్ని, భవిష్యత్తును అమెరికా కోరుకుంటోంది. భద్రతా, సంక్షేమం తదితర అంశాల్లో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలన్నారు.

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, దాని ఆటలు సాగనివ్వమని ఒబామా చెప్పారు. ఇరాన్, ఉత్తర కొరియాలు అణు కార్యక్రమాల విషయంలో ముందుకెళ్లాలనుకుంటే, దీనికి వారే జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ఇరాన్‌తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అయితే అమెరికా సహనం అపరిమితం కాదని బరాక్ ఒబామా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



చంద్రుని పై అపార్ట్ మెంట్లు

చంద్రుడు అంటే మనకి గుర్తుకొచ్చేది చల్లని జాబిలి అదే సైంటిస్ట్ లకు గుర్తుకొచ్చేది చంద్రునిపై నివాసించవచ్చ అనే ఆలోచన అందుకు తగ్గ ప్రయోగాలు చాలఏళ్ళ క్రితం నుంచే సాగుతోంది చంద్రుడు అంటే భూమికన్న చిన్నగా ఉండే ఒక ఉపగ్రహం

ఇది 3.93 బిగ్ బాండ్ మిలియన్స్ ఇది భూమినుండి వేరుపడ్ద ఒక భాగం అని శాస్త్రజ్ణులు కనుక్కోన్నారు ప్రపంచంలోని సైంటిస్ట్ అందరూ ఆలోచిస్తుంది చందునిపై మానవ జీవనం అందుకు అనుగుణంగా జరుగుతున్న ప్రయోగాలలో మానవ జీవితానికి అవసమయిన ముఖ్యమైన వనరులలో ఒక టైన నీరు ఉందో లేదో ముఖ్యముగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు

చంద్రునిపై ఒక భాగంలో మాగ్మ ఐస్గా మారిందాని సైంటిస్ట్ల అంచనా దీనికి సంబందించిన చాల ప్రయోగాలు చాల తీరిలు వచ్చాయ్ ఈ ప్రయోగాళ్ళు ఇప్పటివి కాదు 1961 నుంచి సాగుతున్నాయ్ అందులో ముఖ్యంగా 1994లో జరీన ప్రయోగంలో నాసా ఉపరితలం మీద ఉన్న ఫోటో లు తీసింది ఆ ఫోటోలలో నీరు ఉందనే ఇండికేషన్స్ ఇవి మిక్క్లి చల్లని ప్రదేశం వేనని సైంటొస్ట్ ల అభిప్రాయం చంద్రుని పై రెండు ప్రదేశాలు ఉన్నాయ్ అవి ఒకటి సూర్యుని కాంతి పడుతున్న ప్రాంతం రెండోది పడనిది సూర్యుని కాంతి పడని చోటునీరు ఉందని అందరీ సైంటిస్ట్ ల అభిప్రాయం

చంద్రునిపై ఉత్తర దౄవ ప్రాంతంలో 50వేల మిలియన్ కిలోమీటర్ల ప్రదేశం వరకు నీరు ఉందని భావిస్తున్నారు శాస్త్రజ్ణుల అంచనా 6.6 బిలియన్ టన్నుల మాస్ ఐస్ ఉందని అంచనా చంద్రయాన్ వన్ పంపించిన ఫోటో లలో ఖచ్చితంగా నీరూందని తెలిస్తే చంద్రునిపై మనిషి మనుగడ ఇంకొద్ది సంవత్సరాలలో సులభం అవుతుంది అంతే కాకుండా చంద్రునిపై జీవించాలనే ఆశకూడ ఈ ప్రయోగాలు విజయవంతమవుతుంటే ఆశక్తి రేపుతోంది
ఇదంత ఒక వైపయితే దీనికి మరోకొణం ఉంది అదేంటంటే :చంద్రునిపై ఖనిజాలు ఉన్నాయ్ అని తెలిసింది అవన్ని మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయ్ కాని నేటికాలలో అంతరిక్ష ప్రయోగాలలో అతి వేగంగా అభివౄద్ది చెందుతున్న దేశాలు అంతే అతి వేగంగా వీటికోసం బవిష్యత్తు ని పూలదారిల చేసుకోవాలి కాని ఒకరిలో ఒకరు పోటిపడి చంద్రుని పై కూడ యుద్దాలు సౄష్టించకూడదు





Tuesday, September 22, 2009

బారత్ యొక్క సత్తా అందరికి మరోసారి నిరుపించారు:ఇస్రో

శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగికెగసిన పి.యస్.యల్.వి-సీ-14 పి.యస్.యల్.వి-2ని మోసుకెళ్ళిన పి.యస్.యల్.వి మరో గొప్ప గర్వించదగ్గ ఇండియన్ టెక్నాలజీ ఒకటి ఈ ప్రయోగం ద్వార కక్ష్యలోకి జేరింది

ఇందులో పని చేసిన ప్రతి ఒక్కరు నేషన్ మొత్తం గర్వించదగ్గ ఘనత మనకి ఇస్రో టీం మెంబర్స్ కలిగించారు వారందరికి కౄతజ్ణతలు తెలపాలి దీని ద్వార భారత్ కి ఎన్నో ఉపయోగాలు ఉంటాయ్

ఇందులో పని చేసిన ప్రతి ఒక్కరు ఈ విజయం అనంతరం పి.యస్.యల్.వి.విజయనికి ఎంతో ఆనందపడ్డారు

ఈ విజయం తెలుసుకున్న ప్రధాని,ఉపరాష్టపతి అభినందనలు తెలిపారు

ఇస్రో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ అభినందించారు

వీరందరు ప్రపంచంలో బారత్ యొక్క సత్తా అందరికి మరోసారి నిరుపించారు

మరో రెండు నెలలో జి.యస్.యల్.వి ప్రయోగించనుంది ఇస్రో


గగన తలంలో భారత కీర్తి పతాకం ఎగరవేయడానికి సంసిద్దమయిన పి.యస్.యల్.2

శ్రీహరికోట మరో చారిత్రక ఘటనను ఆవిష్కరించడానికి సంసిద్దమయ్ ఉంది మరో రెండు గంటలో పి.యస్.యల్.వి-2 [ఓషన్ శాట్-2]ప్రయోగన్ జరపడానికి శాస్త్రజ్ణులు అందరు సంసిద్దులయ్ ఉన్నారు దీనిని ఒకసారి 1999లో ఓషన్ శాట్-1ప్రయోగం జరిగి విజయవంటమయింది కాని ఇది దానికన్న అతి పెద్దది అతి వేగవంతమైనది అత్యంత ఆధునికతమైనది దీనిని ప్రయోగిస్తున్నది రుతుపవనాలు-సముద్ర విశేషల గురించితెలుసుకునేందుకు ఈ ప్రయోగం జరుగుతోంది పి.యస్.యల్.వి.రాకెట్ ప్రయోగంలో 16వది ఈ ప్రయోగంద్వార 960కిలోల బరువుకలిగిన 720 కిలోమీటర్ల సూర్యనువర్తన లోకి పంపిస్తున్నారు దీంతో పాటు ఐరొపా కి చెందిన 4 క్యుబ్ శాట్ లు జర్మనీకి చెందిన 8కిలోల బరువున్న రెండు రూబిన్ ఉపగ్రహలను పంపిస్తున్నారు దీని ప్రయోగించిన 1.064 సెకన్లలో ఉపగ్రహ కక్ష్యలో చేరుకుంటుంది ఆ తర్వత మిగిలిన క్యుబ్ శాట్లు కక్ష్య లోకి చేరుకుంటాయ్ ఇందులో విశేషాలు : ఓషన్ శాట్-2ఒక్కోవిడతలో 1420 కిలోమీటర్ల భూభాగాన్ని పరిశీలించి 360 రిజల్యుషన్ గల చిత్రాలను రెండురోజులకొకసారి మనకు పంపుతుంది ఇందులో అమర్చబడిన పెన్సిల్ స్కాటరో మీటర్ ఇటలీ అంతరిక్ష పరిశోధనసంస్థ తయారుచేసిన రేడియో ఆక్యులేషన్ సౌండర్లు సముద్రతీర ప్రాంత విశేషాలు తెలుపుతుంది ముందు ప్రయోగించిన ఓషన్ శాట్-1 ఓషన్ శాట్-2కి సహయంగా నిలుస్తుంది ఐదేళ్ళ వరకు ఇది పనిచేస్తుంది ఎప్పుడు ఉండేటట్టు ఆరు ఘన ఇంధన స్ట్రాప్ ఆన్ బూస్టర్లు సి.14 కి లేవు నాలుగో దశ మోటార్ రూబిన్ ఉపగ్రహ కక్ష్య లోకి తిరుగుతుంది కనుక ప్రతిసారి ల కాకుండా దీనికి మరో అర టన్ను ఇంధనం అధికంగా జోడించారు ప్రపంచంలోనే అతిపెద్దదయిన 139 కిలోల తొలి దశ మోటార్ ను ఇందులో వాడారు రెండో దశలో 41.5 టన్నుల,మూడో దశలో 7.6 టన్నుల ఇంధనం వాడారు ఇందులో సరికొత్త కంప్యూటర్లు,టెలి మెట్రి వ్యవస్తను వాడారు[రాకెట్ పధ గమనాన్ని నిర్దేశించేందుకు ]