Sunday, July 26, 2009

తెలుగు బాష ప్రాధాన్యత"చరిత్ర"

తెలుగు,భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.
తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు వెళ్తే తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినది.

ఆంధ్రులగురించి చెప్పిన పద్యములలో ఒక పద్యం

"పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"

ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.

జ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:

ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం క్రీ.పూ. 28 ముందు:ఆంద్రదేశం అనే పదం ఎలా వచ్చిందంటే: ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు.
అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని,తమిళ,మళయాళ,కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కాలేదు.

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతోంది.


తెలుగుబాష వ్యవాహారం :భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి. భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది

"తెలుగు భాష వయస్సెంత?" అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు కాని కొంతమంది రచయితలు తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశారు.

క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగ0):క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం.

ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

***ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును". కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చు.

***శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చు.

***బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చు.

***ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది.

ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చు.

మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదములు:

""అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం""అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ "" పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చు: 1.ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును. 2.అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును. 3.అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు. క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు): సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి. తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు.నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి

Thursday, July 23, 2009

జైల్లొ ఉన్నా కింగు కింగే

సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు హైదరాబాదు సమీపంలోని చంచల్ గుడా జైల్లో మరో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు ఒక ఆంగ్ల దిన పత్రిలో వచ్చిన వార్త తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఆరు నెలలుగా జైల్లో ఉన్న రామలింగ రాజుకు జైల్లో అభిమానుల సందడికి కొరత లేదట. రామలింగరాజు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో రామలింగరాజు, రామరాజు జైలు జీవితం ఏమంత కష్టతరంగా లేదని తెలుస్తోంది. ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం - వారికి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలు తెగిపోలేదని తెలుస్తోంది.

రామలింగ రాజు సోదరులు జైలు అధికారులకు, మరి కొంత మందికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంపై లాభదాయకమైన సలహాలు ఇస్తున్నారట. రాజు వద్ద సెల్ ఫోన్ కూడా ఉందని ఒక జైలు అధికారి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. జైలు నుంచి రాజు ఇస్తున్న సలహాలతో మార్కెట్ ట్రేడింగ్ విపరీతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ లో పట్టుబడి జైల్లో ఉన్న కృషి వెంకటేశ్వరరావు రామలింగ రాజుకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయినట్లు తెలుస్తోంది. బి - క్లాస్ ఖైదీలుగా రాజు సోదరులకు, వడ్లమాని శ్రీనివాస్ సౌకర్యాలకు కొరత లేదు. మంచాలు, పడకలు, ఫ్యాన్ లు, దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వారికి అందుబాటులో ఉండడం వల్ల జైలు జీవితం వారికి సౌకర్యంగా మారినట్లు ఆ పత్రిక రాసింది.

వారికి ప్రతిరోజు చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వారి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటగదిలో వారి కోసం వంటకాలు జరుగుతాయని సమాచారం. వారి సెల్స్ ను ఇద్దరు స్వీపర్లు రోజూ శుభ్రం చేస్తారు. మరొకరు బట్టలు ఉతుకుతారు. జైలు అధికారులతో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని రాజు సోదరులకు వేంకటేశ్వర రావు సలహాలు ఇస్తున్నారట. రాజుకు సెల్ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను జైలు సూపరింటిండెంట్ ఎం. చంద్రశేఖరరావు ఖండించారు. గూండాలు, మాఫియాలు మాత్రమే సెల్ పోనులను స్మగుల్ చేయగలుగుతారని, సెల్ ఫోన్ ఉంటే రాజును పట్టుకోవడం కష్టం కాదని ఆయన అన్నట్లు పత్రిక రాసింది. చట్టపరంగా లభించే సౌకర్యాలను మాత్రమే రాజు సోదరులు


Wednesday, July 22, 2009

తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారట

మన భారతదేశానికే గొప్పవ్యక్తి ఎంతో మందికి స్పూర్తి అయిన అబ్దుల్ కలాం ని అమెరికన్ ఎయిర్ లైన్స్ తనిఖి చేయటం అనేది భారత ప్రభుత్వం ఖచ్చితంగా తివ్రంగా పరిగణించి క్షమాపణ చెప్పించాలి ఇలాంటి విషయంలో కూడ చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇక మన ప్రభుత్వం ఉన్నదో లేదో అనుకొంటారు ప్రతి విషయాన్ని పట్టించుకున్నట్టే దీన్ని పరిగణిస్తే ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది.నిన్నటి వరకు జాత్యహoకారం ఇప్పుడు మన దేశ రాష్టపతి చేసిన అబ్దుల్ కలాం.ఇలా ఉరుకుంటు పోతే ఒకటి తరువాత ఒకరికి అవమానలు జరుగుతునే ఉంటాయ్ ఈ విషయాన్ని త్వరగ పట్టించుకొండి ఇదంత ఇంత ఒక్కనించి పదే పదే చెపుతున్ననంటే జరిగి ఇంతసేపు అవుతున్న క్షమపణ చెప్పకుండా మాదేశ నిబందనలు అంతే అని ఉరుకున్న వారి ప్రభుత్వం సంగతి తెలియ చెప్పలని

ఇది చదవండి పూర్తిగా తెలుస్తుంది ::: అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ నుంచి క్షమాపణలు చెబుతూ భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కు ఏ విధమైన సమాచారం రానట్లు తెలుస్తోంది. కలామ్ కు క్షమాపణలు చెప్పినట్లు వచ్చిన వార్తలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని తెలుస్తోంది.ఈ విషయాన్ని కలామ్ ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి కలామ్ ను తనిఖీ చేసినట్లు వచ్చిన వార్తలు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఎయిర్ లైన్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్థితిలో కలామ్ కు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా విమానాల్లో సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అందరినీ తనిఖీ చేసినట్లే కలామ్ ను తనిఖీ చేసినట్లు భావిస్తున్నారు. తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారని తెలుస్తోంది.


Saturday, July 18, 2009

బ్లాగరు కన్న గొడ్లు కాసేవాడు మేలు

మనది ఒక బతుకేనా
కుక్కల వలే నక్కల వలే
మనది ఒక బ్రతుకేనా
సందులలొ పందుల వలే
చదువు"కొన్న" వాడికన్న గొడ్లు కాసేవాడు మేలు అన్న సామెతని అక్షరాలా నిజం చేస్తున్నారు చర్చలు అర్దవంతంగా వుంటే కొంత విఙ్నానాన్ని పంచుతాయి అందరికి మేలు చేస్తాయి అర్దం లేని వ్యర్ద ప్రేలాపనలు ఒకళ్ళ కులాన్ని మతాన్ని అధునికత, చాందసవాదం పేరుతో కించపరచుకొవడం ఒక్క పైసా అన్న లాభముంటుందా అసలేంటిది ఈ కేసులు పెట్టుకొవడమేమిటి, 007 లా నేర పరిశోదనలేంటి సరదాగ మీకు అనిపించింది ఇతరులను నొప్పించనిది రాస్తే బావుంటుంది ఒకరు ఒక పొస్టు రాయడం ఇంకొకళ్ళు దానికి స్పందిస్తు మరొకటి ఇంకొంతమంది బ్లాగు లొకాన్ని ఉద్దరిస్తున్నట్టు బిల్డప్పులు ఇన్ని పొస్టులే రాయాలి ఇలానే రాయాలి అని రూల్సు మేము మేము లేక పోతే తెలుగు బ్లాగింగే లెదన్నట్టు తొక్కలో ఉపన్యాసాలు ఎన్నాళ్ళి అన్యాయం ఎన్నాళ్ళి దారుణం దీనికి అంతం లేదా (ఈ లైన్ పాత తెలుగు సినిమా స్టైల్ లొ చదవ గలరు) ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇన్ బ్లాగ్స్


పాలమధనం నాటికే 1ST AID

ఎన్నో ఎన్నెన్నో ఆవిర్భావాలకు,కధలకు విశ్వసమరక్షణ కార్యాలకు దైవ కార్యాలకు అలవాలమైన దేవదానవుల ఐక్యతను పొందుపరుచుకున్న పాలసముద్ర మధనం సంధర్బంలో,దేవతల ఆదేశం మేరకు ఒక్క రోజులో ఈ భూమండలంలో గల అన్ని ప్రాంతాలు,పర్వతాలు,గుహాలు,కొండలు,ఎడారులు,ప్రతి చిన్న ప్రదేశం నుండి అన్ని రకాల ఓషధీ మూలికలను సేకరించి పాలకడలిలో వేసిన బలాఢ్యుడు,అత్యంత వేగవంతుడు జాంబవంతుడే దీర్ఘదర్శులైన దేవదేవులు సముద్ర మధనంలో సౄజింపబడే ఏ కీరుడుకైనా,ముందుగా ఒక ప్రాణరక్షగా ఓషధలు సేకరిచమనడం చూస్తుంటే నేడు ప్రతి చోట కనపడే ఫస్ట్ ఎయిడ్ ఆలోచన ఆ యుగం నాటిదే అని స్పష్టమౌతోంది నాకు ఈ కధ చదివిన తరువాత తెల్సింది మన చెప్పుకునే 1ST-aid అప్పటి పాల మధనం నుండే ఉంది మరీ ఇంకా ఇలాంటివి ఎలా ఉన్నాయో తెలుసుకొని రాస్తాను
ఇదే నిన్న రాసిన జాంబవంతుడు స్టోరీకి 2పార్ట్

ఖగోళ విజ్ణానం తెలుసుకొండి

అప్పుడప్పుడు రాత్రి వేళ్ళల్లో మీరు బైనాక్యులర్స్ లేక చిన్ని టెలిస్కోప్‌తో ఆకాశంలోని నక్షత్రాలను గమనించి ఉంటారు. అరే.. చుక్కలు చాలా దగ్గరలో కనిపిస్తున్నాయే అని సంతోషపడి ఉంటారు.అల్లగే ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించండి.కాని కొన్ని చానల్స్ వారు ఈ సుర్యగ్రహణం తరువాత కొన్నివిపత్తు కలుగుతాయని ప్రచారం కొనసాగిస్తున్నారు ఇదంత పక్కన బెట్టి మన వైజ్ణనికులను మరింత తెలుసుకొండి:మన వైజ్ఞానికులకు ఈ చిన్ని చిన్ని పరికరాలు పెద్దగా ఉపయోగపడవు. అందుకనే వారు అంతరిక్షాన్ని ఖగోళ వేధశాలల్లో అధ్యయనం చేస్తారు. ఖగోళ వేదశాలల్లో అనేక టెలిస్కోపులు మరియు ఇంకా ఇతర పరికరాలు ఉంటాయి. వీటి ద్వారా శాస్త్రవేత్తలు మరింత సమర్థంగా తమ పరిశోధనలను కొనసాగిస్తారు. ఈ ఖగోళ వేధశాలలు ఎత్తైన కొండల మీద, జనావాసాలకు దూరంగా ఉంటాయి.వాటి నుండి అన్ని విషయాలు సమర్దంగా తెలుసుకొని విపత్తులు ఏమయిన ఉంటే ముందే తెలియజేస్తారు ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి మనకి వివరిస్తారు మున్ మున్ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం ద్వార మనం జాగ్రత్త పడవచ్చు ఇవన్ని తెలపాలంటే ఎన్నో పరికరాలు అవసరం అందులో కాలుష్యంతో కూడినవి కొన్ని ఉంటయ్ అందుకే సాధారణంగా వీటిని కాలుష్యంతోనూ, ప్రకాశవంతమైన వెలుతురుతోనూ నిండి ఉండే నగరాలకు దూరంగానే నిర్మిస్తారు. ఖగోళ వేదశాలలను ఎత్తైన పర్వత భాగాలమీదే ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే భూవాతావరణంతో కలిసిపోక ముందే నక్షత్రకాంతిని పర్వతాగ్రాలమీద ఉండే వేధశాలలు సేకరిస్తాయి గనుక పరిశోధనా ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భూవాతావరణం కారణంగా కలుషితమైన నక్షత్రకాంతి సమర్థ పరిశోధనలకు వీలివ్వదు. భూ వాతావరణ కాలుష్యాల బారిన పడకముందే ఖగోళ వస్తువుల కాంతిని పర్వత ప్రాంతాలనుంచి శాస్త్రజ్ఞులు గమనిస్తారు. కాబట్టి వారి అంచనాలు ఖచ్చిత ప్రమాణాలతో ఉండటానికి అవకాశముంది.


Thursday, July 16, 2009

నాలుగుయుగాలలో పుట్టిన జాంబవంతుడు

కౄతయుగంలో విష్ణుపాదపూజ గావించి త్రేతాయుగంలో సహకారసేవలందించి ద్వాపరయుగంలో పిల్లనిచ్చిన జాంబవంతుడు కలియుగంలో ఆంద్రరాష్ట్రంలో గావించిన రామ ప్రతిష్థ

పురాణంలో రామయ్యకి ఉన్న సముచిత స్థానం పౌలస్త్యుని అంతరీల్న ఆలోచన ద్వారాను,భారతదేశంలో అర్జునుడు రామనామ మహిమను అంజనాసుతుని ద్వారా తెలుసుకోవడం ద్వారానూ తెలుస్తునే ఈ అనంత బ్ర్హమండంలో అర్దం కాని పాత్రలు ఎన్నో పోషించే శంకరుడు,పార్వతీదేవికి ఉపదేశించదం ద్వారానూ తెలుస్తునే ఉన్నా,కౄతయుగం నుంచి పురాణపురుషుడై ఉండి
తుర్ యుగంలో రామ ప్రతిష్థ చేసిన జాంబవంత ఉదంతం ద్వారా ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది పురణాతిహేశాల్లో ఎన్నో చోట్ల కీలకమైన ఒక మెరుపులా ఒక తళకులా కనబడుతుండే జాంబవంతుడు ఎవరో ఏమిటో మనకు అర్దం కాదు రామరావణ సంగ్రామంలో పాత్ర పోషించిన ఈ భల్లుక రాజు గీతానాయకుడికి పిల్లనిచ్చిన మామగారి పాత్ర పోషించాడు ఇంతకీ ఇతడేవరనే సంశయం,ప్రశ్న ఉదయించాలి మరి విశ్వానికి తొలిదశలో స్రుష్థ్కి మొట్టమొదటగ, విరాట్స్వారూప శ్రీహరి నాభికమలం నుండి ఉద్బవించిన చతుర్వేది సౄష్టికార్యం అనే భాద్యత స్వీకరించి సౄష్టికి ఆదిగా తన సంకల్పమే సౄష్టి బీజంగా చేసి సంకల్పంలోనే ప్రజాపతులను కొందరు పరమ సత్పురుషులను సృజించాడు ప్రజాపతులను సత్పురుషులు వివహాలు చేసుకుని సౄష్టిని పెంచసాగరు అలాంటి తన సంకల్పంలో ఒకసారి ఆవులించాడు ఆ అనాచిత ఆ సందర్బపు ఆవులింతలో ఒక భల్లుకం పుట్టుకొచ్చింది ఆ భల్లుకమే భల్లుకాలందరికీ రాజు ఆ భల్లుకమేరాజే జాంబవంతుడు సౄష్టికి ఎంతో ముందు ఆదిలో బ్రహ్మమానస పుత్రుడు గనుక జాంబవంతుడు ఇప్పటిదాక గడిచిన అన్ని యుగాలలోనే,అన్ని పురాణాతిహసాలలోనూ ప్రముఖపాత్ర పోషించాడు.సప్త చిరంజీవుల వరుసలో లేకున్నా చిరంజీవిగానే నిలిచాడు.

డబ్బుకు ప్రాదాన్యం ఇవ్వను:అంత కన్నా గొప్ప అబద్దం వుండదు

నేను డబ్బుకు ప్రాదాన్యం ఇవ్వను అనేది చాలామంది నోట వినిపించేమాట.నిజానికి ఆ మాట అనేవారు ఆడుతున్న అతిపెద్ద అబద్దం అది అంత కన్నా గొప్ప అబద్దం మనం ఎప్పుడూ వినివుండం నేడున్న మీస్తానం,భవిష్యత్తులో అందుకోబోయే స్తానం వగేరాలన్ని మీ దగ్గరున్న డబ్బుతో ముడిపడిఉన్నాయ్.కాబట్టి నా జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత లేదనేవారు తమని తాము మోసం చేసుకున్నాట్టే.

మీరు అందుకున్న స్తాయి,సంపాదించిన ఆస్తి,పేరు ప్రఖ్యాతలు ఇవ్వన్ని మీరు సంపాదించిన డబ్బు ద్వారనే వచ్చి ఉంటాయ్ మన జీవితంలోని ప్రతి అవసరం కోసం డబ్బు కావాల్సి ఉంది ఒక్కసారి మీ జీవితంలో వెనక్కి వెళ్ళి మీ తివ్రమైన ఆర్దిక ఇబ్బందిని గుర్తు చేసుకొండి అలా గుర్తు చేసుకునాక ఇప్పుడున్న పరిస్తితిని చూసుకొని డబ్బు వల్ల మీకు కలిగిన లబ్దిని చూసుకొండి డబ్బు ఒక్కటి చాలు మీకు శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది

ఇదంత విన్న తరువాత దీనితో ఏకీభవించి మరి డబ్బుమీద ప్రేమను పెంచుకోకండి డబ్బును ప్రేమించేకొద్ది మీకు కనిపించే వర్గాలు రెండే ధనవంతులు,పేదవాళ్ళు అదే ప్రేమతో ఆలోచిస్తే ఎన్నో వర్గాలు కనిపిస్త్తాయ్ అందరికి సేవలందించాలనే భావన కల్గిస్తుంది ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి మీదగ్గరున్న నోటుని బయటకి తీసి అ నోటుని చించి చూడంది ఈ ఆలోచనే పిచ్చిదని పిస్తోంది కదూ!ఒక నోటును చించలేని మీరు పక్కనవారి జీవితాన్ని మీజీవితంగా భావించలేక పోతున్నారు

నేను ఇంతకి చెప్పలనుకొన్నది డబ్బును ప్రేమించకండి ఉపయోగించండి,ప్రేమను ప్రేమించండి అందరికి పంచండి.



Wednesday, July 15, 2009

మౌనంలో ఆ ప్రమాదం లేదు

నాకు నచ్చిన పదాలు ప్రతి ఒక్కరికి అవసరమయిన పదాలు నచ్చే పదాలు ఇలాంటివి విన్న లేదా తెలుసుకున్న ఎంతో బాగుంటుంది ఎంతో కాన్ ఫిడెన్స్ లభిస్తుంది హింస,ఆయుధం,వ్యతిరేకత,దూషించడం ఇవన్ని నాకు నచ్చని పదాలు గాని ఇలాంటివి నేను క్రిద రాసిన నాకు నచ్చిన పదాలు ప్రపంచమును ముఖ్యపాత్ర వహిస్తున్నాయ్ ఎవరికి తోచిన పదాల ప్రవౄత్తితో వారు నడుచుకు పోతున్న ఈ లోకంలో మనము జాగ్రత్త వహించాల్సి ఉంది ఇతరులకు సహయ పడవల్సి ఉంది మనం మాట్లాడుతున్నంతసేపు మనసు మాట్లడదు.మనం ఆపేస్తే,మనసు మొదలుపెడుతుంది.మౌనంలోనే మనసుతో సంభాషించగలం.పెయింట్ బ్రష్ లు చేయడానికి ఏటా ఐదువేల ఒంటెల్ని చంపుతున్నారట!అన్నాడు భర్త. 'అవునా...ఒంటెల వల్లా ఉపయోగం ఉందన్న మాట ఆశ్చర్య పోయింది భార్య,భాషతో వచ్చిన చిక్కే అది మనం ఒకలా చెబితే,ఎదుటి వాళ్ళకు మరోలా అర్ధం చేసుకోవచ్చు .మౌనంలో ఆ ప్రమాదం లేదు గతంలో అర్ధం లేకుండా మాట్లడినందుకో అనవసరంగా తూలనాడినందుకో పశ్చ్చాతాప్పపడేవారు ఉన్నారు మౌనం కారణంగా భాధపడ్డ దాఖలాలు ఒక్కటీ ఉండవు. దేనికైనా నమ్మకమే పునాది.నమ్మితేనే బాగుంటుంది అనిపిస్తేనే ఏ పనయినా చేస్తాం,అలా నమ్మకమ్నిలబెట్టుకోవడం ముఖ్యం నీ ప్రతిభ గుర్తించాలంటే ఇతరుల ప్రతిభ గురించడం నువ్వు నేర్చుకోవాలి ప్రతి విషం నిదానంగా ఆలోచించి చేయడంకంటే చేసి ఆలోచించే వారు ఎక్కువగా ఉన్నారు ప్రపంచం లో ప్రతి ఒక్కరిని స్నేహితులనే భావించే వారు ఉన్నారు హిట్లర్ వంటి వారు ఉన్నారు మహత్మగాంధి వంటి వారు ఉన్నారు అనుదుకే పైన చెప్పబడిన ప్రతి వాఖ్యం ముఖ్యమైనదనే భావిస్తున్నాను మీ విమర్శ నాకు నచ్చే విధంగా ఉంటుందని భావిస్తు ఈ టపా నేను కొత్తగా కూడలి లో చేరాను టప అంటే నవ్వోస్తోంది కాని మంచి టపాలు చదివినప్పుడు చాల విషయాలు తెలుసుకోవచ్చు మున్ముందు అంత తెలుసుకొంటు జాగ్రత్తగా రాస్తాను ఇట్లు.............కలం


ఇంత విసుగ్గా ఏ యాషెస్ సిరీస్ చూడలేదు

టెస్ట్ క్రికెట్ అనుకున్న విధంగానే బోరింగా ఉంది టెస్ట్ క్రికెట్ 20-20 ఫార్మెట్ వల్ల చాల దెబ్బతింది ప్రతి విషయంలోను ఫాస్ట్ ని కోరుకుంటున్న ఇప్పటి యువతరం టెస్ట్ ని ఆశ్వాదించడానికి ఆసక్తి చూపించట్లేదు యాషెస్ అంటే ఒక గొప్ప చరిత్ర గల టెస్ట్ సిరిస్ లలో ఒకటిగా భావించే యాషెస్ పస లేని బంగ్లా జింబాబ్వే టెస్ట్ లా అనిపించింది ఇంత వరకు నేను చూసిన యాషెస్ లలో ఇంత విసుగ్గా ఏ యాషెస్ సిరీస్ ని చూడలేదు దినికి కారణం 20-20 వెంటనే ఈ సిరీస్ ఆరంభించడంతో ఇలా జరిగి ఉండచ్చు ఒక పక్క యాషెస్ మరో పక్క శ్రీలంక,పాకిస్థాన్ ల టెస్ట్ లు చప్పగా కొనసాగుతున్నాయ్ ఒండే ల కొసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు 20 -20 అయితే మరి మంచిది అని భావిస్తున్నారు ఎందుకంటే అందులో ఖచ్చితంగా గెలుపో ఓటమో తెలుతుంది టెస్ట్ లో డ్రా పద్దతి ఉండే సరికి అందరికి బోరింగ్ గా మారింది అలాగని క్రికెటర్స్ భావించట్లేదు ఎవరి టీం రికార్డ్ వారు చూసుకొని ఓడటం కంటే డ్రా చేసుకోవడం మంచిదని భావించి గెలుపు సాధ్యం కానప్పుడు బంతులన్ని తింటు ఒక అర్ధ సెంచరీనో సెంచరీనొ కొట్టి టీం ని ఓటమినుండి కాపాడి గొప్పగా ఫీల్ అవుతున్నారు అది టెస్ట్ క్రికెట్ చరిత్రని మరుగున పడేస్తోందని ఎవరు భావించట్లేదు మీకు తోచిన అభిప్రాయం మీరు వ్యక్తం చేయండి భావలు అనుచుకోకండి ఏమన్న తప్పనిపిస్తే చెప్పండి మీ విమర్శే నాకు ..........మీ విమర్శ చూసి చెపతాను

Tuesday, July 14, 2009

అసలే ఆర్ధిక మాంద్యం

మీకు తెలుసా మనదేశంలో సగం కొనుగోలుశక్తి గ్రామీణపాంతలలోనే ఈప్పుడు అసలే ఆర్ధిక మాంద్యం అటువంటి సమయంలో ఈ వర్షలు రైతులని కాదండి దెబ్బతీస్తోంది మన ఆర్ధికస్తితిని గ్రామీణ ప్రాంతలలో వర్షధార లేకపోయేసరికి వారి ఆదాయం గణనీయంగా పడిపోతోంది దాని కారణంగానే భారత ఉపాధి పార్శ్రామిక ప్రగతి పడిపోతాయ్ ప్రతిరంగాన్ని భయపెడుతున్న ఆందోళన కల్గిస్తున విషయం వర్షం ఏప్పుడొస్తుంది?ఈ ప్రశ్న ప్రతి పారిశ్రామిక వేత్తలకి రైతులకి ప్రతి రాష్ట ముఖ్యమంత్రులకు దేశప్రతినిధి మన్మోహన్ కి అందోళనకర విషయాలలో ఒకటిగా మారింది దానికి ఆర్దికమాంద్యం అంటు ప్రతి ధర పెంచుకు పోతుంటే రైతులకి మరి ఇబ్బంది ప్రతి దేశం పడుతున్న ఉగ్రవాద సమస్యలతో పాటు మనకి ఇలా కొత్త సమస్యలు ఎదురవుతున్నాయ్

మౌనం భాషలేని ప్రార్ధన

మౌనం భాషలేని ప్రార్ధన మౌనం...మాటలేని విజ్ఞానం నిశ్శబ్ద మంత్రఘోష మౌనం...అతిగొప్ప సంభాషణ మౌన... పదునైన ఆయుధం. చుక్కలెంత నిశ్శబ్దంగా వెన్నెల కురిపిస్తున్నాడు.సూర్యుడెంత నిశ్శబ్దంగా తూర్పు,పడమరల ప్రయాణం సాగిస్తున్నాడు చల్లగాలి ఎంత నిశ్శబ్దంగా ప్రసరిస్తోందో.మనుషుల్ని సముద్రాల్నీ కొండల్నీ కోనల్నీ అంత బరువును భుజానికెత్తుకున్న భూమి ఎంత నిశ్శబ్దంగా పరిభ్రమిస్తుందో సౄష్టికర్తకు మౌనమంటే ఇష్టమనుకుంట అందుకే,సౄష్టిలో అంత నిశ్శబ్దం మౌనమంటే పదాల ప్రతిభందకాల్లేన్ని నిశ్శబ్ద సంభాషణ అంటారు అద్బుతమైన కానుకలు ఇచ్చేవారంత మౌనంగా ఇస్తారు వాటిని స్వీకరించేవారు మౌనంగానే స్వీకరిస్తారు ఇది ఎంత లోతైన భవన! మాటకచేరీలు ఇచ్చేవారున్నరు మాటలతో కోటలు కట్టడమేలాగో చెప్పే పుస్తకాలున్నయ్ కాని మౌనాన్ని నేర్పించే బడులే లేవు అందుకే ప్రపంచమంత నిశ్శబ్ద వ్యతిరేకత వచ్చినట్టు ఏటుచూసిన రణగొణ ద్వనుల సంగీతం పెరిగిపోయింది

మనం మాటలకు అలవాటుపడిపోయాం మాటల మత్తులోపడి మాట్లాడకపోతే తోచదు అలా అలవాటు పడవద్దు ఉపవాసం ఉండే వాడికి అన్నం విలువ తెలిసినట్టు మౌనంగా ఉంటే మాటల విలువ తెలుస్తుంది ఒక్కరోజైన మౌనవ్రతం ఉండి మౌనం విలువ తెలుసుకొండి మౌన వ్రతం అంటే మౌనం మాటలకే కాదు మనసుకు సంబందించింది కంప్యుటర్ చాటింగ్ చేస్తు మౌనంగా ఉన్ననంటే సరిపోదు పూర్తిగా మౌన కోసమే మీవ్రతం కేటాయించాలి అలా ఉండ లేని సమయంలో రోజుకి ఒక అరగంట లేద గంట ఉండి మౌనం విలువ తెలుసుకొండి ఇలాంటివి ప్రపంచంలో పాటించాల్సిన పద్దతులు ఎన్నో ఉన్నాయ్ అవాన్ని తెలుసుకొండి,తెలుసుకోవడానికి ప్రయత్నించండి

స్వామి వివేకానందుడు వివరించిన గౄహస్థ ధర్మం సన్యాస ధర్మం

స్వామి వివేకానందుడు గౄహస్థ ధర్మం సన్యాస ధర్మం గురించి కధలు చెప్పరు ముందుగా గ్రుహస్థ ధర్మం కధ: ఒకానొక చెట్టుమీద గూడు కట్టుకొని ఒక పక్షి కుటుంబం ఉంటున్నాయి ఒక సన్యాసి వేసవికాలంలో అన్నిచోట్ల తిరిగి ఆకలి భాధతో ఆ చెట్టు నీడలో పడుకున్నాడు అది చూచి ఆ చెట్టుమీద ఉండే మగ పక్షి ఆడ పక్షితో ఇతడు మన అతిధి ఇతనికి ఆహరన్ని ఒసగటం మన ధర్మమం అని ఎక్కడనుంచో ఎండు పుల్లలు ఏరుకొచ్చి అగ్నిని పుట్టించి ఆ ఎండుపుల్లలో వేసి వెలిగించి అ మంటలో అ పక్షి దుముకుతుంది(ఫడిపోయింది) అది చూసి సన్యాసి బాధపడతాడు ఆడ పక్షి కూడ ఈ కొంచం ఆహరంతో అతిధికి ఆకలి తిరదు అనుకొని అది కూడ మంటలో దూకుతుంది ఈ విధంగానే పిల్లలు కూడ అగ్నిలో దూకుతారు ఇదంత చూచిన సన్యాసి ఆ రాత్రంత విచారించి పక్షి కుటుంబం మొత్తం నా వలన కదా!చని పోయింది అని తలచి ఆహరం ముట్టకుండ విచారంతో వెనుతిరుగుతాడు.మనం గ్రుహస్తు ధర్మం అంటే మనకోసమే కాక అతిధి,బిక్షగాళ్ళు..మొదలయిన వారికి గౄహస్తే ఆహరం ఇవ్వటం ధర్మం సన్యాస ధర్మం :ఒకానొక సన్యాసి దేశదేశాలు తిరుగుతు భగవత్ జ్ఞానం చేస్తు వెలుతు ఉంటాడు ఒకరోజున ఒక దేశంలో వెళుతూంటే చాల మంది గుంపులుగుంపులుగా భద్రగజం చుట్టు మూగి ఉంటారు అక్కడ ఏమి జరుగుతుందోనని అ సన్యాసి ఆగిపోతాడు అంతక ముందుకొనాళ్ళ క్రితం ఆ దేశం యొక్క రాజు చనిపోతాడు అ రాజుకి వారసులుగా పుత్ర సంతనం లేదు ఒక కుమార్తె ఉంది దీనితో మంత్రులు ఒక తీర్మానాన్ని చేస్తారు ఆ తీర్మనంలో అ రాజు ఉరేగే భద్రగజం ఎవరి మెడలో అయితే పూలదండ వేస్తుందో అతనికి అ రాజు కుమార్తేతో వివహం చేసేట్లు అతడే యువరాజు అవుతాడని తీర్మానం చేస్తాడు ఈ సన్యాసి అదే సమయానికి అ గుంపులో ఒక పక్కగా నుంచుంటాడు అ గజం ఈ సర్వసంఘపరిత్యాగి అయిన సన్యాసి మెడలో దండవేస్తుంది వెంటనే భటులు మంత్రులు అ సన్యాసిని రాజ మందిరానికి తీసుకెళ్ళి మనగళ స్నానలు చేయించి మంచి బట్టలు కట్టి కీరిటాలు పెట్టి హరాలు వేసి మేళతాళలతో హడావిడి చేస్తారు ఇదంత బాల సన్యాసి కి ఇష్టం ఉండదు నేను సన్యాసి ని నాకు ఈ భోగాలు ఏమి వద్దు అని చెబుతున్న వినిపించుకొరు రాత్రి హడవిడి తగ్గగానే ఆభరణాలు వస్త్రాలు అన్ని తీసేసి మరల కాషాయ వస్త్రాలు ధరించి అ రాజ్యం వదిలి పారిపోతాడు ఇది సన్యాసి యొక్క కర్తవ్యం,ధర్మo
ఇలాంటి విషయాలు ఇప్పటి సన్యాసులు,గౄహస్తులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి