Thursday, July 16, 2009

డబ్బుకు ప్రాదాన్యం ఇవ్వను:అంత కన్నా గొప్ప అబద్దం వుండదు

నేను డబ్బుకు ప్రాదాన్యం ఇవ్వను అనేది చాలామంది నోట వినిపించేమాట.నిజానికి ఆ మాట అనేవారు ఆడుతున్న అతిపెద్ద అబద్దం అది అంత కన్నా గొప్ప అబద్దం మనం ఎప్పుడూ వినివుండం నేడున్న మీస్తానం,భవిష్యత్తులో అందుకోబోయే స్తానం వగేరాలన్ని మీ దగ్గరున్న డబ్బుతో ముడిపడిఉన్నాయ్.కాబట్టి నా జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత లేదనేవారు తమని తాము మోసం చేసుకున్నాట్టే.

మీరు అందుకున్న స్తాయి,సంపాదించిన ఆస్తి,పేరు ప్రఖ్యాతలు ఇవ్వన్ని మీరు సంపాదించిన డబ్బు ద్వారనే వచ్చి ఉంటాయ్ మన జీవితంలోని ప్రతి అవసరం కోసం డబ్బు కావాల్సి ఉంది ఒక్కసారి మీ జీవితంలో వెనక్కి వెళ్ళి మీ తివ్రమైన ఆర్దిక ఇబ్బందిని గుర్తు చేసుకొండి అలా గుర్తు చేసుకునాక ఇప్పుడున్న పరిస్తితిని చూసుకొని డబ్బు వల్ల మీకు కలిగిన లబ్దిని చూసుకొండి డబ్బు ఒక్కటి చాలు మీకు శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది

ఇదంత విన్న తరువాత దీనితో ఏకీభవించి మరి డబ్బుమీద ప్రేమను పెంచుకోకండి డబ్బును ప్రేమించేకొద్ది మీకు కనిపించే వర్గాలు రెండే ధనవంతులు,పేదవాళ్ళు అదే ప్రేమతో ఆలోచిస్తే ఎన్నో వర్గాలు కనిపిస్త్తాయ్ అందరికి సేవలందించాలనే భావన కల్గిస్తుంది ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి మీదగ్గరున్న నోటుని బయటకి తీసి అ నోటుని చించి చూడంది ఈ ఆలోచనే పిచ్చిదని పిస్తోంది కదూ!ఒక నోటును చించలేని మీరు పక్కనవారి జీవితాన్ని మీజీవితంగా భావించలేక పోతున్నారు

నేను ఇంతకి చెప్పలనుకొన్నది డబ్బును ప్రేమించకండి ఉపయోగించండి,ప్రేమను ప్రేమించండి అందరికి పంచండి.



2 comments:

  1. correctee but vuntaaru alantivaaru kooda dabbuki value ivvani vaallu

    ReplyDelete
  2. బాగా చెప్పారు :-)

    ReplyDelete