Thursday, July 23, 2009

జైల్లొ ఉన్నా కింగు కింగే

సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు హైదరాబాదు సమీపంలోని చంచల్ గుడా జైల్లో మరో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు ఒక ఆంగ్ల దిన పత్రిలో వచ్చిన వార్త తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఆరు నెలలుగా జైల్లో ఉన్న రామలింగ రాజుకు జైల్లో అభిమానుల సందడికి కొరత లేదట. రామలింగరాజు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో రామలింగరాజు, రామరాజు జైలు జీవితం ఏమంత కష్టతరంగా లేదని తెలుస్తోంది. ఆ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం - వారికి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలు తెగిపోలేదని తెలుస్తోంది.

రామలింగ రాజు సోదరులు జైలు అధికారులకు, మరి కొంత మందికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంపై లాభదాయకమైన సలహాలు ఇస్తున్నారట. రాజు వద్ద సెల్ ఫోన్ కూడా ఉందని ఒక జైలు అధికారి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. జైలు నుంచి రాజు ఇస్తున్న సలహాలతో మార్కెట్ ట్రేడింగ్ విపరీతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ లో పట్టుబడి జైల్లో ఉన్న కృషి వెంకటేశ్వరరావు రామలింగ రాజుకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయినట్లు తెలుస్తోంది. బి - క్లాస్ ఖైదీలుగా రాజు సోదరులకు, వడ్లమాని శ్రీనివాస్ సౌకర్యాలకు కొరత లేదు. మంచాలు, పడకలు, ఫ్యాన్ లు, దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వారికి అందుబాటులో ఉండడం వల్ల జైలు జీవితం వారికి సౌకర్యంగా మారినట్లు ఆ పత్రిక రాసింది.

వారికి ప్రతిరోజు చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వారి కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటగదిలో వారి కోసం వంటకాలు జరుగుతాయని సమాచారం. వారి సెల్స్ ను ఇద్దరు స్వీపర్లు రోజూ శుభ్రం చేస్తారు. మరొకరు బట్టలు ఉతుకుతారు. జైలు అధికారులతో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని రాజు సోదరులకు వేంకటేశ్వర రావు సలహాలు ఇస్తున్నారట. రాజుకు సెల్ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను జైలు సూపరింటిండెంట్ ఎం. చంద్రశేఖరరావు ఖండించారు. గూండాలు, మాఫియాలు మాత్రమే సెల్ పోనులను స్మగుల్ చేయగలుగుతారని, సెల్ ఫోన్ ఉంటే రాజును పట్టుకోవడం కష్టం కాదని ఆయన అన్నట్లు పత్రిక రాసింది. చట్టపరంగా లభించే సౌకర్యాలను మాత్రమే రాజు సోదరులు


No comments:

Post a Comment