Saturday, July 18, 2009

ఖగోళ విజ్ణానం తెలుసుకొండి

అప్పుడప్పుడు రాత్రి వేళ్ళల్లో మీరు బైనాక్యులర్స్ లేక చిన్ని టెలిస్కోప్‌తో ఆకాశంలోని నక్షత్రాలను గమనించి ఉంటారు. అరే.. చుక్కలు చాలా దగ్గరలో కనిపిస్తున్నాయే అని సంతోషపడి ఉంటారు.అల్లగే ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించండి.కాని కొన్ని చానల్స్ వారు ఈ సుర్యగ్రహణం తరువాత కొన్నివిపత్తు కలుగుతాయని ప్రచారం కొనసాగిస్తున్నారు ఇదంత పక్కన బెట్టి మన వైజ్ణనికులను మరింత తెలుసుకొండి:మన వైజ్ఞానికులకు ఈ చిన్ని చిన్ని పరికరాలు పెద్దగా ఉపయోగపడవు. అందుకనే వారు అంతరిక్షాన్ని ఖగోళ వేధశాలల్లో అధ్యయనం చేస్తారు. ఖగోళ వేదశాలల్లో అనేక టెలిస్కోపులు మరియు ఇంకా ఇతర పరికరాలు ఉంటాయి. వీటి ద్వారా శాస్త్రవేత్తలు మరింత సమర్థంగా తమ పరిశోధనలను కొనసాగిస్తారు. ఈ ఖగోళ వేధశాలలు ఎత్తైన కొండల మీద, జనావాసాలకు దూరంగా ఉంటాయి.వాటి నుండి అన్ని విషయాలు సమర్దంగా తెలుసుకొని విపత్తులు ఏమయిన ఉంటే ముందే తెలియజేస్తారు ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి మనకి వివరిస్తారు మున్ మున్ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం ద్వార మనం జాగ్రత్త పడవచ్చు ఇవన్ని తెలపాలంటే ఎన్నో పరికరాలు అవసరం అందులో కాలుష్యంతో కూడినవి కొన్ని ఉంటయ్ అందుకే సాధారణంగా వీటిని కాలుష్యంతోనూ, ప్రకాశవంతమైన వెలుతురుతోనూ నిండి ఉండే నగరాలకు దూరంగానే నిర్మిస్తారు. ఖగోళ వేదశాలలను ఎత్తైన పర్వత భాగాలమీదే ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే భూవాతావరణంతో కలిసిపోక ముందే నక్షత్రకాంతిని పర్వతాగ్రాలమీద ఉండే వేధశాలలు సేకరిస్తాయి గనుక పరిశోధనా ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భూవాతావరణం కారణంగా కలుషితమైన నక్షత్రకాంతి సమర్థ పరిశోధనలకు వీలివ్వదు. భూ వాతావరణ కాలుష్యాల బారిన పడకముందే ఖగోళ వస్తువుల కాంతిని పర్వత ప్రాంతాలనుంచి శాస్త్రజ్ఞులు గమనిస్తారు. కాబట్టి వారి అంచనాలు ఖచ్చిత ప్రమాణాలతో ఉండటానికి అవకాశముంది.


No comments:

Post a Comment