Tuesday, July 14, 2009

స్వామి వివేకానందుడు వివరించిన గౄహస్థ ధర్మం సన్యాస ధర్మం

స్వామి వివేకానందుడు గౄహస్థ ధర్మం సన్యాస ధర్మం గురించి కధలు చెప్పరు ముందుగా గ్రుహస్థ ధర్మం కధ: ఒకానొక చెట్టుమీద గూడు కట్టుకొని ఒక పక్షి కుటుంబం ఉంటున్నాయి ఒక సన్యాసి వేసవికాలంలో అన్నిచోట్ల తిరిగి ఆకలి భాధతో ఆ చెట్టు నీడలో పడుకున్నాడు అది చూచి ఆ చెట్టుమీద ఉండే మగ పక్షి ఆడ పక్షితో ఇతడు మన అతిధి ఇతనికి ఆహరన్ని ఒసగటం మన ధర్మమం అని ఎక్కడనుంచో ఎండు పుల్లలు ఏరుకొచ్చి అగ్నిని పుట్టించి ఆ ఎండుపుల్లలో వేసి వెలిగించి అ మంటలో అ పక్షి దుముకుతుంది(ఫడిపోయింది) అది చూసి సన్యాసి బాధపడతాడు ఆడ పక్షి కూడ ఈ కొంచం ఆహరంతో అతిధికి ఆకలి తిరదు అనుకొని అది కూడ మంటలో దూకుతుంది ఈ విధంగానే పిల్లలు కూడ అగ్నిలో దూకుతారు ఇదంత చూచిన సన్యాసి ఆ రాత్రంత విచారించి పక్షి కుటుంబం మొత్తం నా వలన కదా!చని పోయింది అని తలచి ఆహరం ముట్టకుండ విచారంతో వెనుతిరుగుతాడు.మనం గ్రుహస్తు ధర్మం అంటే మనకోసమే కాక అతిధి,బిక్షగాళ్ళు..మొదలయిన వారికి గౄహస్తే ఆహరం ఇవ్వటం ధర్మం సన్యాస ధర్మం :ఒకానొక సన్యాసి దేశదేశాలు తిరుగుతు భగవత్ జ్ఞానం చేస్తు వెలుతు ఉంటాడు ఒకరోజున ఒక దేశంలో వెళుతూంటే చాల మంది గుంపులుగుంపులుగా భద్రగజం చుట్టు మూగి ఉంటారు అక్కడ ఏమి జరుగుతుందోనని అ సన్యాసి ఆగిపోతాడు అంతక ముందుకొనాళ్ళ క్రితం ఆ దేశం యొక్క రాజు చనిపోతాడు అ రాజుకి వారసులుగా పుత్ర సంతనం లేదు ఒక కుమార్తె ఉంది దీనితో మంత్రులు ఒక తీర్మానాన్ని చేస్తారు ఆ తీర్మనంలో అ రాజు ఉరేగే భద్రగజం ఎవరి మెడలో అయితే పూలదండ వేస్తుందో అతనికి అ రాజు కుమార్తేతో వివహం చేసేట్లు అతడే యువరాజు అవుతాడని తీర్మానం చేస్తాడు ఈ సన్యాసి అదే సమయానికి అ గుంపులో ఒక పక్కగా నుంచుంటాడు అ గజం ఈ సర్వసంఘపరిత్యాగి అయిన సన్యాసి మెడలో దండవేస్తుంది వెంటనే భటులు మంత్రులు అ సన్యాసిని రాజ మందిరానికి తీసుకెళ్ళి మనగళ స్నానలు చేయించి మంచి బట్టలు కట్టి కీరిటాలు పెట్టి హరాలు వేసి మేళతాళలతో హడావిడి చేస్తారు ఇదంత బాల సన్యాసి కి ఇష్టం ఉండదు నేను సన్యాసి ని నాకు ఈ భోగాలు ఏమి వద్దు అని చెబుతున్న వినిపించుకొరు రాత్రి హడవిడి తగ్గగానే ఆభరణాలు వస్త్రాలు అన్ని తీసేసి మరల కాషాయ వస్త్రాలు ధరించి అ రాజ్యం వదిలి పారిపోతాడు ఇది సన్యాసి యొక్క కర్తవ్యం,ధర్మo
ఇలాంటి విషయాలు ఇప్పటి సన్యాసులు,గౄహస్తులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి


No comments:

Post a Comment