Tuesday, July 14, 2009

మౌనం భాషలేని ప్రార్ధన

మౌనం భాషలేని ప్రార్ధన మౌనం...మాటలేని విజ్ఞానం నిశ్శబ్ద మంత్రఘోష మౌనం...అతిగొప్ప సంభాషణ మౌన... పదునైన ఆయుధం. చుక్కలెంత నిశ్శబ్దంగా వెన్నెల కురిపిస్తున్నాడు.సూర్యుడెంత నిశ్శబ్దంగా తూర్పు,పడమరల ప్రయాణం సాగిస్తున్నాడు చల్లగాలి ఎంత నిశ్శబ్దంగా ప్రసరిస్తోందో.మనుషుల్ని సముద్రాల్నీ కొండల్నీ కోనల్నీ అంత బరువును భుజానికెత్తుకున్న భూమి ఎంత నిశ్శబ్దంగా పరిభ్రమిస్తుందో సౄష్టికర్తకు మౌనమంటే ఇష్టమనుకుంట అందుకే,సౄష్టిలో అంత నిశ్శబ్దం మౌనమంటే పదాల ప్రతిభందకాల్లేన్ని నిశ్శబ్ద సంభాషణ అంటారు అద్బుతమైన కానుకలు ఇచ్చేవారంత మౌనంగా ఇస్తారు వాటిని స్వీకరించేవారు మౌనంగానే స్వీకరిస్తారు ఇది ఎంత లోతైన భవన! మాటకచేరీలు ఇచ్చేవారున్నరు మాటలతో కోటలు కట్టడమేలాగో చెప్పే పుస్తకాలున్నయ్ కాని మౌనాన్ని నేర్పించే బడులే లేవు అందుకే ప్రపంచమంత నిశ్శబ్ద వ్యతిరేకత వచ్చినట్టు ఏటుచూసిన రణగొణ ద్వనుల సంగీతం పెరిగిపోయింది

మనం మాటలకు అలవాటుపడిపోయాం మాటల మత్తులోపడి మాట్లాడకపోతే తోచదు అలా అలవాటు పడవద్దు ఉపవాసం ఉండే వాడికి అన్నం విలువ తెలిసినట్టు మౌనంగా ఉంటే మాటల విలువ తెలుస్తుంది ఒక్కరోజైన మౌనవ్రతం ఉండి మౌనం విలువ తెలుసుకొండి మౌన వ్రతం అంటే మౌనం మాటలకే కాదు మనసుకు సంబందించింది కంప్యుటర్ చాటింగ్ చేస్తు మౌనంగా ఉన్ననంటే సరిపోదు పూర్తిగా మౌన కోసమే మీవ్రతం కేటాయించాలి అలా ఉండ లేని సమయంలో రోజుకి ఒక అరగంట లేద గంట ఉండి మౌనం విలువ తెలుసుకొండి ఇలాంటివి ప్రపంచంలో పాటించాల్సిన పద్దతులు ఎన్నో ఉన్నాయ్ అవాన్ని తెలుసుకొండి,తెలుసుకోవడానికి ప్రయత్నించండి

No comments:

Post a Comment