Wednesday, July 22, 2009

తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారట

మన భారతదేశానికే గొప్పవ్యక్తి ఎంతో మందికి స్పూర్తి అయిన అబ్దుల్ కలాం ని అమెరికన్ ఎయిర్ లైన్స్ తనిఖి చేయటం అనేది భారత ప్రభుత్వం ఖచ్చితంగా తివ్రంగా పరిగణించి క్షమాపణ చెప్పించాలి ఇలాంటి విషయంలో కూడ చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇక మన ప్రభుత్వం ఉన్నదో లేదో అనుకొంటారు ప్రతి విషయాన్ని పట్టించుకున్నట్టే దీన్ని పరిగణిస్తే ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది.నిన్నటి వరకు జాత్యహoకారం ఇప్పుడు మన దేశ రాష్టపతి చేసిన అబ్దుల్ కలాం.ఇలా ఉరుకుంటు పోతే ఒకటి తరువాత ఒకరికి అవమానలు జరుగుతునే ఉంటాయ్ ఈ విషయాన్ని త్వరగ పట్టించుకొండి ఇదంత ఇంత ఒక్కనించి పదే పదే చెపుతున్ననంటే జరిగి ఇంతసేపు అవుతున్న క్షమపణ చెప్పకుండా మాదేశ నిబందనలు అంతే అని ఉరుకున్న వారి ప్రభుత్వం సంగతి తెలియ చెప్పలని

ఇది చదవండి పూర్తిగా తెలుస్తుంది ::: అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ నుంచి క్షమాపణలు చెబుతూ భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ కు ఏ విధమైన సమాచారం రానట్లు తెలుస్తోంది. కలామ్ కు క్షమాపణలు చెప్పినట్లు వచ్చిన వార్తలు కంటితుడుపు చర్యలు మాత్రమేనని తెలుస్తోంది.ఈ విషయాన్ని కలామ్ ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి కలామ్ ను తనిఖీ చేసినట్లు వచ్చిన వార్తలు భారత్ లో తీవ్ర దుమారం రేపాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఎయిర్ లైన్స్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్థితిలో కలామ్ కు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా విమానాల్లో సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అందరినీ తనిఖీ చేసినట్లే కలామ్ ను తనిఖీ చేసినట్లు భావిస్తున్నారు. తమ నిబంధనలను మాత్రమే అమెరికన్లు పాటిస్తారని తెలుస్తోంది.


No comments:

Post a Comment