తన తండ్రి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైఎస్ జగన్ ఆ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక మార్కెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే సర్కులేషన్‌ను పెంచుకోవడమే కాకుండా, కోట్లాది మంది పాఠకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా, తెలుగు పత్రికా రంగాన్ని శాశిస్తూ వచ్చిన "ఆ రెండు పత్రిక"ల యాజమాన్యం గుండెల్లో దడ పుట్టించేలా చేసింది.
ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రచారాన్ని ఆ పత్రిక, టీవీ ఇచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసి ఓటర్ల మనస్సు మారకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఖంగుతిన్న జగన్.. తన సొంత పత్రిక ద్వారా కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు రోశయ్య ప్రభుత్వ పనితీరును ఎండగడుతోందని ఆ పత్రికా పాఠకులు అంటున్నారు.
మొత్తం మీద జగన్ పత్రిక ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా మారిందనే చెప్పొచ్చు.
మీరు ఇలా కాపీ-పేస్ట్ టపాలు చెయ్యడం మానేస్తే మీ పరువు నిలబడుతుంది.
ReplyDeleteనికెందుకయ్యచదివితే చదువు లేక పోతే మానే నాకు తెలిసింది నా బ్లాగులో పెట్టుకుంటా
ReplyDeletekareshtigaa chepparu...
ReplyDelete