jagan:రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు చేయూత నిచ్చేందుకు కాంగ్రెస్ కార్యర్తలు, వైఎస్ జగన్, వైఎస్సార్ అభిమానులు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాస ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. వరద సహాయక చర్యల్లో పర్యటించాలనే కోరిక ఉందన్నారు. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద ప్రాంతాల పర్యటనకు వెళ్ళి, సహాయక చర్యలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు జగన్ తెలిపారు.
rosaiah:వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహాయక సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య పిలుపునిచ్చారు. శ్రీశైలంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. వరద పరిస్థితిపై ఆయన ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల వరద ప్రమాదం పొంచివుందన్నారు. అయితే, ప్రస్తుతానికి వరద ఉధృతి తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ, వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారులకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచన మేరకు ప్రమాద ప్రాంతాలను తక్షణం ఖాళీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఖాళీ చేయని వారిని పోలీసుల సహకారంతో బలవంతంగా అక్కడ నుంచి తరలించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. వరద నీరు తగ్గిన తర్వాత తిరిగి తమ ఆవాసాలకు వెళ్లాలని, ఇలాంటి వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తుందని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 7.19 లక్షల క్యూసెక్కుల నీరు ఉందన్నారు. ఎగువ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తే ఈ నీటిమట్ట మరింతగా పెరిగే అవకాశం ఉందని రోశయ్య తెలిపారు. అందువల్ల కరకట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
chandrababu:వరద సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులను శక్తిమేరకు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ తమ ప్రాంతాల్లోని వరద బాధితుల సమాచారం సేకరించడం, వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు చేరవేయాలని కోరారు. అంతేకాకుండా, వరద బాధితులకు స్వచ్ఛందంగా తమ వంతు సాయం అందజేయాలని బాబు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తిన వరద కారణంగా కర్నూలు జిల్లా పూర్తిగా నీట మునిగిపోగా, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడెక్కడ వరద బాధితులు ఇబ్బందుల్లో ఉన్నారో సమాచారం తెలుసుకొని కంట్రోల్ రూమ్ లకు అందజేస్తే అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. అదే సమాచారాన్ని తమకు కూడా పంపిస్తే ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వరద ముంపు ముంచుకు వచ్చిన ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన భోజన సౌకర్యం కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
పెద్ద పెద్ద నాయకులు వారి వారి స్పందన తెలిపారు మీరు మీ స్పందన సహయం తెలియజేయండి
రాజకీయనాయకులందరు పిలుపులిచ్చేవాళ్ళేగానీ, స్వయంగా వచ్చి, వళ్ళువంచి సహాయకార్యక్రమాలు నిర్వహించేవాళ్ళే లేరుకదా!
ReplyDelete